మహిళ సాధికారతకు, స్వయం సమృద్ధికి గొడుగుపట్టేలా తానా మాజీ కోశాధికారి కొల్లా అశోక్‌బాబు ప్రకాశం జిల్లా పర్చూరు మండలానికి చెందిన 50మంది మహిళలకు చేయూతనందించారు. 100 రోజుల పాటు కుట్టుమిషన్ల వినియోగం, కుట్లు, అల్లికలు తదితర నైపుణ్యాలపై వీరికి శిక్షణనిచ్చి, కుట్టుమిషన్లు సైతం అందజేశారు. ఆయా మహిళలకు తాను చేసిన ఈ చిరు సాయం వారి ఆర్థిక స్వావలంబనకు మొదటిమెట్టుగా మారుతుందని అశోక్ ఆశాభావం వ్యక్తపరిచారు.
వీరికి నైపుణ్యాభివృద్ధి, సామాగ్రి పెట్టుబడిని అందించామని, దీనితో పాటు సంపాదన అవకాశాలను కూడా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల ఏకరూప దుస్తులను వీరి చేత రూపొందిస్తామని తద్వారా వీరికి నిధులు కూడా అందుతాయని అశోక్ తెలిపారు. తానా-రోటరీ క్లబ్‌ల సంయుక్త సహకారంతో శిక్షణ సదస్సులను నిర్వహించారు. కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z