Politics

తెదేపా విరాళాల సేకరణ కోసం కొత్త వెబ్‌సైట్ ఏర్పాటు-NewsRoundup-Apr 09 2024

తెదేపా విరాళాల సేకరణ కోసం కొత్త వెబ్‌సైట్ ఏర్పాటు-NewsRoundup-Apr 09 2024

* తెదేపా విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా రూ.99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్‌ఆర్‌ఐలకోసం వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించినట్టు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారికి రశీదులు కూడా ఇస్తామన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్‌ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు.

* మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు.’’ అని పేర్కొంది.

* అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేద్దామని నర్సాపురం ఎంపీ, తెదేపా నేత రఘురామ కృష్ణరాజు అన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. పవన్‌, నాగబాబుతో మంచి సంబంధాలున్నాయని, ఎక్కడి నుంచి పోటీ చేసినా.. పవన్‌ తన తరఫున ప్రచారం చేస్తారని అన్నారు.

* ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు.

* పోగొట్టుకున్న మొబైల్‌ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్‌ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించేందుకు ‘ఫైండ్‌ మై డివైజ్‌’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ గూగుల్‌ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది.

* ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్‌ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని పీలీభీత్‌లో భాజపా మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత్‌ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హయాంలో భారత భూభాగంలో ఒక్క అంగుళాన్నీ చైనా (China) ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘బై-బై’ చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా అస్సాంలోని లఖింపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

* సాధారణంగా ఒక దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పితేనో, లేక రాజకీయ సంక్షోభం తలెత్తితేనో అత్యవసర పరిస్థితి విధిస్తారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయినా కఠిన ఆంక్షలు అమలుచేస్తారు. కానీ, దేశ ప్రజలు డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని ఎమర్జెన్సీ విధించారని ఎప్పుడైనా విన్నారా? పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో (Sierra Leone) అదే జరిగింది. యువకుల్లో చాలామంది ఓ రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో పడిపోతున్నారు.

* పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

* ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ‘కచ్చితమైన’ హక్కేమీ కాదని వ్యాఖ్యానించింది. ‘‘అత్యంత విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే తప్ప.. అభ్యర్థి, తన కుటుంబసభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేసింది. అతడు/ఆమె తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వారికి ఉందని తెలిపింది. ఈసందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కరిఖో ఎన్నికను సమర్థించింది. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హయాంలో భారత భూభాగంలో ఒక్క అంగుళాన్నీ చైనా (China) ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘బై-బై’ చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా అస్సాంలోని లఖింపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసిన తమ ప్రభుత్వం చొరబాట్లను అరికట్టిందని చెప్పారు.

* నటి విద్యా బాలన్‌ (Vidya Balan) అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌పై (Mohanlal) ప్రశంసలు కురిపించారు. ‘చక్రం’ అనే మలయాళం సినిమాలో ఆయనతో కలిసి నటించిన విద్యా ఆ సమయంలో ఆయన్ని చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అవి తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ‘‘ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి. ‘చక్రం’ సినిమా సెట్‌లో ఆయన చేసిన పనులకు నేను ఆశ్చర్యపోయాను. షూటింగ్‌ విరామ సమయంలోనూ ఆయన పని గురించే ఆలోచిస్తారు. పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. దర్శకుడు షాట్‌కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆయనకు సినిమాపై ఉండే అంకితభావం చూసి నేను స్ఫూర్తి పొందాను. సినిమా బాగా రావాలని ఆయనపడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది. అంతే కాదు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్‌లో చిన్నచిన్న పనులు చేయడానికి కూడా వెనుకాడరు. కెమెరా ఫోకస్‌ ఎంతదూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్‌ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు. ఆ షూటింగ్‌లో ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నా. వ్యక్తిగతంగా ఎదగడం కంటే టీమ్‌గా ముందుకు సాగడం మరింత ముఖ్యమని అర్థమైంది’’ అని విద్యా చెప్పారు. ఆమె మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ‘చక్రం’ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ (AK Antony) కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని పదనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్‌ కె.ఆంటోని ఓటమిని కోరుకున్నారు. యూడీఎఫ్‌ అభ్యర్థి ఆంత్రో ఆంటోని విజయం సాధించాలన్నారు. ఈమేరకు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు పోటీ చేస్తున్న పార్టీ ఓడిపోవాలని, అతడి ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కడా తన కుమారుడి పేరును మాత్రం నేరుగా ఆంటోనీ ప్రస్తావించలేదు.

* ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z