తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 9న ఈ వేడుకలు నిర్వహించారు. పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. స్థానిక కాలమాన ప్రకారం కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు-మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మలచే ప్రత్యేకంగా రూపొందించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు. పప్పు దుర్గా శర్మ విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర, కొండపల్లి చిశితలు అష్టలక్ష్మి, దేవ దేవంభజే కీర్తనలపై ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు ఉత్సాహంగా సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఉగాది పచ్చడి, తెలుగు భోజనం ఆస్వాదించారు.
నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా,బసిక అనిత రెడ్డిలు వేడుకలను సమన్వయపరిచారు. TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, బొందుగుల రాము, నంగునూరి వెంకటరమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చమిరాజ్ రామాంజనేయులు, మన్నము శ్రీమాన్, రాజిడి రాకేష్ రెడ్డిలు సహకారం అందజేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z