NRI-NRT

లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు

లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ సెంటర్‌లో మార్చి 16-, ఏప్రిల్‌ 6న పోటీలు నిర్వహించింది. లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్‌ డబుల్స్‌, మెన్స్‌ 40+ డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, విమెన్స్‌ డబుల్స్‌, విమెన్స్‌ 35+ డబుల్స్‌, అండర్‌-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు. టాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు.

రవి సబ్బ (చైర్మన్), కిరణ్ కప్పెట (వైస్ చైర్మన్) అలీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వాలంటీర్స్ కు, క్రీడాకారులకు, కార్యకర్తలు సుధాకర్ గుబ్బల (కోర్ టీమ్), బాలాజీ కల్లూరు (కోర్ టీమ్), అనిల్ రెడ్డి (కోర్ టీమ్), రాజేష్ వీరమాచనేని, రాజేష్ తోలేటి (TAL మాజీ వైస్ చైర్మన్/కోశాధికారి), వెంకట్ నీల (ట్రస్టీ – నిధుల సేకరణ), అనిల్ అనంతుల (ట్రస్టీ – మెంబర్‌షిప్ & ట్రెజరర్), రాయ్ బొప్పన (ఐటీ ఇన్‌ఛార్జ్)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z