* ఫ్యాషన్ ప్రియుల నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)కు నిరసన సెగ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన దుస్తులు, బూట్లు మ్యాచ్ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన వారికి సారీ చెప్పి, సమాధానపర్చాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు- నీలం రంగు షర్ట్, ప్యాంట్‌కు కాంబినేషన్‌లో అడిడాస్ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్ ధరించారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను మెప్పించలేదు.
* ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్త్రృతం చేస్తున్నామని వివరించారు.
* జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో.. ఫేక్ పరిశ్రమను వైకాపా తెరపైకి తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం పార్టీ ముఖ్యనేలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానెల్ పేరుతో వైకాపా ఫేక్ వీడియోలు సృష్టిస్తోంది. ప్రజలు నమ్మే వార్తా ఛానెల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారు.
* భారత్, చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు (India China Ties) ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై చైనా (China) స్పందిస్తూ.. స్థిరమైన, సత్సంబంధాలు ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేకూరుస్తాయని తెలిపింది.
* ట్రూంగ్ మై లాన్.. వియత్నాం (Vietnam)లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. ‘వాన్ థిన్ ఫాట్’ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు (12.5 బిలియన్ డాలర్లు) సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు (Truong My Lan) అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది.
* నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్, తన వర్గం నేతలతో కలిసి గతేడాది శరద్‌పవార్ (Sharad Pawar)కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత మహారాష్ట్రలో ఉన్న భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే ఆ సమయంలో కమలం పార్టీతో కలిసేందుకు శరద్ పవార్ కూడా సిద్ధమైనట్లు అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
* దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోనే ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తిహాడ్ జైలులో ఉన్న కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది.
* సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్థాన్ (Pakistan)పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో దాయాది అసమర్థతను ఎద్దేవా చేశారు. అది తమకు చేతకాదని పాక్ భావిస్తే.. ఆ దేశానికి సహకారం అందించేందుకు తాము (India) సిద్ధంగా ఉన్నామని అన్నారు.
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాల (AP Inter Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
* ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు (EC) ఇచ్చిన వివరాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉండగా.. విశ్వసనీయ సమాచారం అంటూ కారణం చూపి సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తును తిరస్కరించింది.
* ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో తెదేపా నేత మోహన్‌రావుపై వైకాపా దాడిని ఆయన ఖండించారు. ‘‘రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా?’’ అని ప్రశ్నించారు. పూర్తి కథనం
* దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు.
* తితిదే విజిలెన్స్ అదుపులో నకిలీ ఐఏఎస్ అధికారితిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
* ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రయాణిస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటున్నప్పుడు చిత్రీకరించిన వీడియోపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటికి కౌంటర్ తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.
* తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
* హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ (Israel Hamas conflict) నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు.
* ఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple) తమ థ్రెట్ నోటిఫికేషన్ వ్యవస్థను అప్‌డేట్ చేసింది. ‘కిరాయికి తీసుకున్న స్పైవేర్’ ద్వారా లక్షిత సైబర్ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్ (iPhone) సహా యాపిల్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ‘ఎఫ్‌ఏక్యూ (FAQs)’లో పేర్కొంది.
* ప్రముఖ ఫొటో ఎడిటింగ్ యాప్‌లన్నీ కృత్రిమ మేధ (Artificial Intellingence) ఆధారిత టూల్స్‌ను అందిస్తున్నాయి. యూజర్లకు మరింత మెరుగైన ఎడిటింగ్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఫొటోస్ (Google Photos) సైతం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
* క్రికెటర్లు హార్దిక్ (Hardik Pandya), కృనాల్ పాండ్య తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య (Vaibhav Pandya) వీరికి పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు.
* అసాధ్యమనుకున్న విజయాన్ని గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ తొలి ఓటమిని రుచిచూసింది. ఒకదశలో ఆ జట్టు విజయం ఖాయమని అంతా భావించారు.
* సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం తెదేపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకొన్నారు. మంగళగరి గ్రామీణ మండలం కురగల్లుకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. గతంలో జగన్‌కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. జగన్ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశంలో చేరుతున్నట్లు వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z