NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగది వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగది వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీశ్రీనివాసునికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేక విశేష పూజలు, మహాలక్ష్మి-విష్ణుదుర్గ అమ్మవార్లకు అభిషేకములు నిర్వహించారు. స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో ఈ వేడుకలు జర్పారు.
పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ- తెలుగు వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి,ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలను పంపిణీ చేస్తామని తెలిపారు.

కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఉగాదికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని అతిథులకు అందించామని ఎఱ్ఱాప్రగడ చాణక్య తెలిపారు. అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. కార్యక్రమానికి సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గానికి, అర్చకులకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు,భక్తులకు, పంచాంగ శ్రవణం చేసిన పండితులకు, సేవాదళ సభ్యులకు, కార్యక్రమానికి హాజరైన భక్తజనకోటికి కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z