WorldWonders

అబద్ధపు అత్యాచారం కేసు. ₹50వేల జరిమానా.

అబద్ధపు అత్యాచారం కేసు. ₹50వేల జరిమానా.

బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్‌ శుక్రవారం రూ.50 వేల జరిమానా విధించారు. మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర ఠాణాలో 2023 సెప్టెంబరు 22న బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. ఓ యువకుడిపై అప్పటి ఎస్సై రాజు పోక్సో కేసు నమోదు చేసి.. కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆరు నెలలపాటు విచారణ సాగింది. న్యాయస్థానంలో సాక్షులను విచారిస్తున్న క్రమంలో బాలిక తల్లి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఆమెకు రూ.50 వేల జరిమానా కట్టాలని లేదా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలంటూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z