2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.
స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్‌కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z