* ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లను మే 1 నుంచి జూన్ 30 వరకు ఉత్పత్తి జరుపుతూ ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో గరిష్ఠంగా 260 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 243 గిగావాట్ల ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే గ్యాస్ బేస్డ్ జనరేటింగ్ స్టేషన్ల (జీబీఎస్)ను వినియోగించుకోవాలనే నిర్ణయం తీసుకుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మే 1 నుంచి జూన్ 30 వరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం ఈ ఆర్డర్ చెల్లుబాటులో ఉంటుంది.
* కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్/ బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలంది. ‘‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR) జరిపిన విచారణలో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006లో ‘హెల్త్ డ్రింక్’ అని దేన్నీ నిర్వచించలేదు అని నిర్ధరణకు వచ్చింది’’ అని కేంద్రం ఏప్రిల్ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈక్రమంలో అన్ని ఇ-కామర్స్ కంపెనీలు/ పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్/ బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
* అమెరికా కార్ల తయారీ సంస్థ ‘జీప్’.. భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్‌యూవీ ‘కంపాస్’ నైట్ ఈగల్ ఎడిషన్ రీలాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.25.04 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్ లో పరిమిత యూనిట్లు మాత్రమే విక్రయిస్తామని జీప్ ప్రకటించింది. కంపాస్ నైట్ ఈగల్ మోడల్ కార్ల ప్రేమికులు కంపెనీ అధికారిక వెబ్ సైట్, సమీప డీలర్ల వద్ద కారు బుక్ చేసుకోవాలని తెలిపింది. అడాస్ తరహా సేఫ్టీ ఫీచర్లతో లీటర్ పెట్రోల్ పై 17.1 కి.మీ మైలేజీ అందిస్తున్నది.
* అధునాతన టెక్నాలజీ సాయంతో రోజుకో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి వస్తున్నది. కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లతోపాటు త్రీ వీలర్స్- ఆటో రిక్షాల తయారీ సంస్థలు సైతం విద్యుత్ వాహనాల తయారీ వైపు మొగ్గుతున్నాయి. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సాయంతో ఒమెగా సైకీ మొబిలిటీ (ఓఎస్ఎం) అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. 8.8కిలోవాట్ల ప్రొప్రైటరీ బ్యాటరీ ప్యాక్‌తో ఓఎస్ఎం స్ట్రీమ్ కిక్ ఈవీ త్రీ వీలర్ వస్తున్నది. ఎక్స్‌పోనెంట్ రాపిడ్ చార్జింగ్ నెట్ వర్క్ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే నగరంలో 126 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z