“షికాగో తెలుగు అసోసియేషన్” ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత, నాట్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి ప్రార్థనతో కార్యక్రమం మొదలైంది.స్థానిక ప్రవాస చిన్నారులు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పోటీని నిర్వహించారు. వేడుకలను విజయవంతం చేసిన వాలంటీర్లు, ఆహుతులకు సంస్థ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z