NRI-NRT

11 దేశాల కవులతో అంతర్జాతీయ ఉగాది కవి సమ్మేళనం

11 దేశాల కవులతో అంతర్జాతీయ ఉగాది కవి సమ్మేళనం

వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై ‘ఉగాది కవి సమ్మేళనం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉగాదిని(Ugadi Celebrations) పురస్కరించుకుని విదేశాలలో నివసిస్తున్న తెలుగు కవుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 11 దేశాల నుంచి సుమారు 40 మంది కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. త్వరలో ఈ కవితలు అన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురిస్తామని నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ రాజ్యసభ సభ్యులు, సాహితీవేత్త పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల కవులకు అభినందనలు తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయకవి, రచయిత భువనచంద్ర, కోయిలను పిలుస్తూ ఒక పాటను రచించి శ్రావ్యంగా పాడి వినిపించడం అందరినీ మరింత ఆహ్లాదపరిచింది. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వంశీ అధ్యక్షరాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ, రాధిక మంగిపూడి, తదితరులు పాల్గొన్నారు. పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు కింది లింక్‌ లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z