NRI-NRT

కెనడాలో తెలుగు పరిమళాలు ప్రసరించిన తాకా ఉగాది

కెనడాలో తెలుగు పరిమళాలు ప్రసరించిన తాకా ఉగాది

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం నాడు కెనడా టోరొంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో వైభవంగా నిర్వహించారు. తాకా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల అతిథులకు శుభాకాంక్షలు తెలిపి వేడుకలు ప్రారంభించారు. కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించగా ధనలక్ష్మి మునుకుంట్ల, సాధన పన్నీరు, వాణి జయంతి, అనిత సజ్జ మరియు సుకృతి బాసనిలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కెనడా జాతీయ గీతం ఆలాపనతో మొదలయి ఆరు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సాగాయి. మంజునాథ్ పంచాంగ శ్రవణం చేశారు.

2024 సంవత్సరపు తాకా ఉగాది పురస్కారాలను ప్రముఖ వైద్యులు డా.జగన్మోహన్ రెడ్డి గరిస, ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దీపిక దామెర్ల, కెనడాలో తెలుగు ప్రముఖులు లక్ష్మీనారాయణ సూరపనేనిలకు అందజేశారు. ప్రముఖ తెలంగాణా చిత్రకారులు డా.కొండపల్లి శేషగిరిరావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా An Odyssey of Life and Art Dr Kondapalli Seshagiri Rao పుస్తకాన్ని విజయరామారావు-సుబ్బారావు, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లయం, అధ్యక్షులు రమేశ్ మునుకుంట్లలు ఆవిష్కరించారు.

వంటకాలతో ఏర్పాటుచేసిన రుచికరమైన తెలుగు భోజనం అలరించింది. కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, సాయి బోధ్ కట్టా, యూత్ డైరక్టరు లిఖిత యార్లగడ్డ, ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు శృతి ఏలూరి, వాణి జయంతి, పవన్ బాసని, ఫౌండర్లు హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతలుగా అనిత సజ్జ, విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, లిఖిత యార్లగడ్డలు వ్యవహరించారు. రాజ్ సజ్జ, గిరిధర్ మోటూరి, రాజేశ్ చిట్టినేనిలు సహకరించారు. భారత జాతీయ గీతాలాపనతో 2024 ఉగాది ఉత్సవాలు ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z