గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టీఎస్ న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక విభాగాలు హైదరాబాద్ నగరంలో ఎప్పటికప్పుడు మత్తు ముఠాల ఆటకట్టిస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్తదారుల్లో నగరానికి గంజాయి తీసుకొస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఐస్‌క్రీమ్‌లపై హ్యాష్ ఆయిల్ చల్లి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి గంజాయి చాక్లెట్లు నగరంలోకి ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై నిఘా పెరగడంతో పొడిగా మార్చి.. వేర్వేరు పేర్లతో అమ్ముతున్నారని పోలీసులు చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z