తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Olathe North West High Schoolలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. కార్యదర్శి మధు గంట స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేసిన అనంతరం ప్రార్థనాగీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రఘు వేముల, చందన తియగూర, శ్వేత అడుసుమిల్లిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యం, జానపద, శాస్త్రీయ నృత్యాలను ప్రవాస చిన్నారులు, పెద్దలు ప్రదర్శించి అలరించారు.
నూతన కార్యవర్గ సభ్యులను TAGKC అధ్యక్షుడు చంద్ర యక్కలి, ట్రస్ట్ బోర్డు సభ్యులను ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు శివ తియగూరలు పరిచయం చేశారు. అధ్యక్షుడు చంద్ర యక్కలి అతిథులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో తెలుగులో మాట్లాడాలని కోరారు. అనంతర పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. తెలుగు భోజనం అలరించింది. కార్తీక్, సూర్య తదితరులు సహకరించారు. ఉపాధ్యక్షురాలు శ్రావణి మేక ధన్యవాదాలు, భారత జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z