అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి మహాసభలు ముగిశాయి. ‘మాటా’ ఫౌండర్, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికైంది. సినీనటులు అలీ దంపతులు, నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఈ సందర్భంగా ‘మాటా’ అవార్డులతో సత్కరించారు. ‘మాటా’ లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డు డా. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్యామరెడ్డిలకు దక్కింది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్పెషల్ సావనీర్‌ను ఆవిష్కరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z