Videos

వీడియో తీసిందని టీచర్ చేయి కొరికిన మహిళ ప్రిన్సిపాల్

వీడియో తీసిందని టీచర్ చేయి కొరికిన మహిళ ప్రిన్సిపాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్‌ పనివేళల్లో ఫేషియల్‌ చేయించుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థులకు ఆహారం వండే గదిలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకోగా అనమ్‌ఖాన్‌ అనే ఉపాధ్యాయురాలు దాన్ని వీడియో తీశారు. దీన్ని గమనించిన సంగీతాసింగ్‌ ఒక్కసారిగా కుర్చీపై నుంచి లేచి ఉపాధ్యాయురాలిపై దాడి చేశారు. ఫోను లాక్కొనే క్రమంలో చేయిని కొరకడంతో అనమ్‌ఖాన్‌కు రక్త గాయమైంది. దీంతో తాను గాయాలతో ఉన్న వీడియోను కలిపి రెండింటినీ అనమ్‌ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z