Kids

చాక్లెట్లు తిని రక్తవాంతులు చేసుకున్న చిన్నారి-CrimeNews-Apr 20 2024

చాక్లెట్లు తిని రక్తవాంతులు చేసుకున్న చిన్నారి-CrimeNews-Apr 20 2024

* చాక్లెట్లు తిని ఏడాదిన్నర చిన్నారి రక్త వాంతులు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. పాటియాలలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో చిన్నారికి గిఫ్ట్‌ ప్యాక్‌లో స్నాక్స్‌, చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు. ఈ చాక్లెట్లు తిన్న చిన్నారి రక్త వాంతులు చేసుకుందని చిన్నారి దగ్గరి బంధువు ఒకరు తెలిపారు. అయితే ఆ చాక్లెట్లు ఎక్స్‌పైరీ చాక్లెట్లని తేలాయి. వాంతులు చేసుకున్న వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షాపు వాళ్లే గడువు తీరిపోయిన ఎక్స్‌పైరీ చాక్లెట్లు అమ్ముతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షాపు నుంచి ఎక్స్‌పైరీ చాక్లెట్లు, స్నాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చ్‌ నెలలోనే పాటియాలలో బర్త్‌డే కేక్‌ తిన్న ఒక చిన్నారి ఫుడ్‌ పాయిజన్‌ అయి మృతి చెందిన విషయం తెలిసిందే.

* సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలో సామాన్యులు బ‌ల‌వుతూనే ఉన్నారు. ల‌క్ష‌ల రూపాయాల‌ను కాజేస్తున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. సైబ‌ర్ క్రైమ్ డీసీపీ పేరిట ఓ సైబ‌ర్ నేర‌గాడు రూ. 12 ల‌క్ష‌లు కాజేశాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో వెలుగు చూసింది. ఓ సైబ‌ర్ నేర‌గాడు.. హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్‌కు ఫోన్ చేశాడు. త‌న‌ను తాను ముంబై సైబ‌ర్ క్రైమ్ డీసీపీగా ప‌రిచ‌యం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్‌తో అనుసంధానంగా ప‌లు బ్యాంకు ఖాతాలు ఉన్నాయ‌ని, వాటి నుంచి రూ. 8 వేల కోట్ల లావాదేవీలు జ‌రిగాయ‌ని సైబ‌ర్ నేర‌గాడు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. మ‌నీలాండ‌రింగ్ చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోదైంద‌ని, రూ. 12 ల‌క్ష‌ల 75 వేలు చెల్లించాల‌ని డాక్ట‌ర్‌ను డిమాండ్ చేశారు. దీంతో భ‌య‌ప‌డిపోయిన డాక్ట‌ర్.. వారు కోరిన మొత్తాన్ని చెల్లించి, చివ‌ర‌కు మోస‌పోయిన‌ట్లు గుర్తించాడు. అనంత‌రం బాధిత డాక్ట‌ర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇలాంటి బెదిరింపులు వ‌స్తే.. 1930కి కాల్ చేయాల‌ని పోలీసులు సూచించారు.

* గర్భవతి అయిన భార్యపై ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. దీంతో ఆరు నెలల గర్భిణీ అయిన ఆ మహిళ మంటల్లో కాలి మరణించింది. ఆమె కవలల గర్భిణీ అని పోలీసులు తెలిపారు. (Man set on fire pregnant wife) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామంలో భార్యాభర్తలైన పింకీ, సుఖ్‌దేవ్‌ నివసిస్తున్నారు. పింకీ ఆరు నెలల గర్భవతి. ఆమె కడుపులో కవలలు పెరుగుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z