DailyDose

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం-CrimeNews-Apr 22 2024

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం-CrimeNews-Apr 22 2024

* షుగర్‌ వ్యాధికి జైలులో ప్రత్యేకంగా వైద్యం చేయించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను లిక్కర్‌ కేసు విచారిస్తున్న ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కోర్టు సోమవారం(ఏప్రిల్‌22) కొట్టివేసింది. రక్తంలో బ్లడ్‌ షుగర్ లెవెల్స్‌ ఎక్కువగా ఉన్నందున జైలులో ప్రయివేట్ డాక్టర్ కన్సల్టేషన్‌తో పాటు ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకుంటానని కేజ్రీవాల్‌ ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేశారు. జైల్లో ఉన్న వాళ్లందరికీ ఒకే రూల్ వర్తిస్తుందని, జైలు డాక్టర్లే అవసరమైన వైద్యం అందిస్తారని పిటిషన్‌ను విచారించిన కోర్టు స్పష్టం చేసింది. కాగా, లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

* తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో సోమవారం(ఏప్రిల్‌ 22) విచారణ జరిగింది. కేసులో నిందితులుగా ఉన్న రాధా కిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్‌ పిటిషన్‌లలో పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతోందని, నిందితులకు బెయిల్‌ ఇవ్వవద్దని పోలీసులు కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని కౌంటర్‌లో తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది.

* మున‌గాల మండ‌లం ముకుందాపురం స‌మీపంలో సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆగివున్న కంటైనర్ కింద‌కు వేగంగా వ‌చ్చిన ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. కారులోనే మృత‌దేహాల‌ను ఇరుక్కుపోయాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేశారు. ఈ దృశ్యాలు అక్క‌డున్న పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కారు అతివేగంతో కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లింది. వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే. మృతుల‌ను నవీన్ రాజా(29), భార్గ‌వి(24)గా గుర్తించారు. వీరిద్ద‌రూ హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే కంటైన‌ర్ కింద ఇరుక్కుపోయిన కారును అతిక‌ష్టం మీద బ‌య‌ట‌కు తీశారు. ఆ త‌ర్వాత మృత‌దేహాల‌ను కారులో నుంచి బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. న‌వీన్ రాజా విజ‌య‌వాడ‌లోని శ్రీ చైత‌న్య కాలేజీలో ప‌ని చేస్తున్న‌ట్లు స‌మాచారం.

* వికారాబాద్ బ‌స్టాండ్‌లో ఓ ప్ర‌యాణికుడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై ఆ ప్ర‌యాణికుడు దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో బ‌స్సుల‌ను డ్రైవ‌ర్లు నిలిపివేసి ఆందోళ‌కు దిగారు. వివ‌రాల్లోకి వెళ్తే.. వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవ‌ర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బ‌స్టాండ్‌లో బ‌స్సును నిలిపివేశాడు. బ‌స్సులోనే కండక్ట‌ర్, డ్రైవ‌ర్ క‌లిసి టిఫిన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో న‌వాజ్ అనే ప్ర‌యాణికుడు వ‌చ్చి బ‌స్సు ఆల‌స్యంపై ప్ర‌శ్నించాడు. టిఫిన్ చేస్తున్నాం.. ఐదు నిమిషాల్లో బ‌య‌ల్దేరుతుంద‌ని డ్రైవ‌ర్.. ప్ర‌యాణికుడికి చెప్పాడు. అవేమి వినిపించుకోని న‌వాజ్.. డ్రైవ‌ర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవ‌ర్లంతా క‌లిసి దాదాపు 45 బ‌స్సుల‌ను నిలిపేశారు. డ్రైవ‌ర్ రాములుపై దాడి చేసిన న‌వాజ్‌ను అరెస్టు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. న‌వాజ్‌పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బ‌స్సుల నిలిపివేత‌తో ప‌రిగి, తాండూరు, హైద‌రాబాద్ వెళ్లే ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z