1979లో ఏర్పాటు అయిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వాటిని ప్రోత్సహించడాన్ని లక్ష్యాలుగా పెట్టుకుంది. స్థానిక ప్రతిభావంతులతో ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ పూర్విజ్ ష్రాఫ్, జి.టి. గుల్ సర్కిల్ శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.
కోవిడ్ తరువాత ఈ సంవత్సరం..”గూన్జ్ సితారోన్ కి” అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18న స్థానిక సిటి హాల్‌లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ రాణి సింగ్ , చైర్ పర్సన్ రానూ సింగ్, ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్తేజ్ సింగ్, కార్యదర్శి జయ పీసపాటి, భారతీయ కన్సులార్ కుచిభోట్ల వెంకట్ రమణ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా సత్వంత్ ఖనాలియా ముఖ్య అతిహిగా హాజరయ్యారు. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న కార్యక్రమాలను, కళారులకి ఒక చక్కని వేదికని అందిస్తున్నందుకు ప్రశంసించారు. ఇందులో భాగంగా తెలుగు అమ్మాయి జేమీ లీవర్‌ని హాంగ్‌కాంగ్‌కు ఆహ్వానించింది. ఆమె మిమిక్రీతో సరదాగా నవ్వించారు. హేమ మాలిని, మలైకా, దీపికా పాడుకోన్, కంగనా రనౌత్, ఆశా భోంస్లే, ఫరా ఖాన్, ఆమె తండ్రి జాని లీవర్‌లను అనుకరించి అలరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z