DailyDose

AK47 పేలి కొత్తగూడెంలో DSP మృతి-CrimeNews-Apr 24 2024

AK47 పేలి కొత్తగూడెంలో DSP మృతి-CrimeNews-Apr 24 2024

* ప్ర‌మాద‌వ‌శాత్తు ఏకే 47 గ‌న్ పేలి సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌రిధిలోని పూస‌గుప్ప 81వ బెటాలియ‌న్‌లో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ డీఎస్సీ శేష‌గిరి రావు కింద ప‌డిపోవ‌డంతో.. ఆయ‌న వ‌ద్ద ఉన్న ఏకే 47 ప్ర‌మాద‌వ‌శాత్తు పేలింది. దీంతో ఛాతి కింది భాగంలో తీవ్ర గాయాల‌య్యాయి. ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోగా శేష‌గిరి రావు ప్రాణాలు కోల్పోయారు. శేష‌గిరి రావు మృతిప‌ట్లు సీఆర్పీఎఫ్ ఉన్న‌తాధికారులు సంతాపం వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

* సీఎం జగన్‌పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్‌ కుమార్‌ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుట్రకోణంపై నిందితుణ్ని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

* హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్‌కుమార్‌(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్‌(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. అక్రమార్జనతో కొనుగోలు చేసే ఆస్తులను శివబాలకృష్ణ.. వీరి పేరిట రిజిస్టర్‌ చేయించేవాడని తేల్చింది. శివబాలకృష్ణ ఇంట్లో సోదాల సమయంలో వీరి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురు అరెస్టయ్యారు. శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్‌ అరెస్ట్‌ కాగా.. బెయిలుపై విడుదలయ్యారు.

* స్క్రాప్‌ మెటీరియల్‌ మాఫియా డాన్‌ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్‌ కాజల్‌ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్‌ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు. నోయిడా పోలీసులు థాయ్‌లాండ్‌ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీం‍ద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్‌స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్‌ మెటీరియల్‌ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్‌ మెటీరియల్ డీలర్‌ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్‌ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్‌ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్‌ అయ్యారు.

* వీసా ప్రాసెస్‌లో భాగంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ కోసం వెళ్తున్న బీటెక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి సత్యనారాయణపురానికి దొంతరి మధుసూదన్‌రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వర్షిత్‌ రెడ్డి (23) బీటెక్‌ పూర్తి చేశాడు. విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.

* హర్దోయికి చెందిన యోగేష్‌ కుమార్‌కు(86) మణికర్ణిక కుమారి(28)కు ఆరేళ్ల కిత్రమే వివాహమైంది. యోగేష​ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. కుమారి హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఆసుపత్రికి వెళ్తుండగా సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-హర్దోయ్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో మణికర్ణిక మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఆమె గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ సహాయంతో భర్తకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యోగేష్‌ తన భార్య వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య తనను వదిలి వెళ్లడం జీర్ణించుకోలేక మనోవేదనతో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా యోగేష్ సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యోగేష్‌ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ‘మేమిద్దరం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ అని అందులో రాసి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z