ScienceAndTech

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మూడోసారి అంతరిక్షయానం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండనున్నారు. ఈమేరకు నాసా ప్రకటించింది.

ఇక వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో నిర్వహిస్తోన్న మొదటి మానవ సహిత మిషన్ ఇది. దీనిలోభాగంగా స్టార్‌లైనర్ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే.. అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. మే 6న ఈ లాంచింగ్ జరగనుంది. కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్‌ ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. సునీత తొలి పర్యటన.. 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు సాగింది. అప్పుడు 29 గంటల 17 నిమిషాల పాటు నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. తర్వాత 2012లో నాలుగు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z