Business

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకపోతే రెండింటలు TDS-BusinessNews-Apr 25 2024

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకపోతే రెండింటలు TDS-BusinessNews-Apr 25 2024

* ఆధార్‌-పాన్‌ లింక్‌ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) లింక్‌ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్‌/టీసీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌/కలెక్షన్‌ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్‌/టీసీఎస్‌ వసూలుంటుందని స్పష్టం చేసింది. కాగా 2022 జూన్‌ 30 వరకు ఆధార్‌తో పాన్‌ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్‌ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్‌ అవ్వని పాన్‌ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్‌ కావాలంటే రూ.1,000 ఫైన్‌ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్‌, పాన్‌ లింక్‌ కాకపోతే ఐటీ రిఫండ్‌ ఉండదు. లింక్‌ చేసుకున్న తర్వాత రిఫండ్‌ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు.

* భారత్‌లో మహిళలకు అప్పుపుట్టడం కష్టంగా మారిందని, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది. అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు 47 శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) కోసం టైర్-2 పట్టణాల నుంచి 18-55 ఏళ్ల వయసు ఉన్న 1,200 మందిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు, తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని 95 శాతం మంది మహిళలు చెప్పారు. అయితే 52 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. కానీ 47 శాతం మందికి మాత్రం అప్పుపుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది. సర్వేలో భాగంగా 80 శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు. 51 శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. 31 శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది.

* ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో (Zomato)’ తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో ఆర్డర్లు చేసిన వెంటనే డెలివరీ అయ్యేవి. కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ కు గిరాకీ పెరుగుతుండటంతో ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తున్నది. అందునా వారాంతంలో మరీ ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఫుడ్ ఆర్డర్లు మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు జొమాటో ‘ఫాస్ట్ డెలివరీ’ సేవలు ప్రారంభించనున్నది. ఈ ఫాస్ట్ డెలివరీ సేవల కింద ఫుడ్ ఆర్డర్ చేసిన వారు కొంత సొమ్ము అధికంగా పే చేయాల్సి ఉంటది. ఇప్పటికైతే ముంబై, బెంగళూరు నగరాల్లోని సెలెక్టెడ్ ప్రాంతాల్లో ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది జొమాటో. ముంబై, బెంగళూరు నగరాల్లోని సెలెక్టెడ్ రెస్టారెంట్లను ఈ ఫీచర్‌కు జత చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకొని లాభాలను నమోదు చేశాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే 73,572.34 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 73,556.15 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. చివరి సెషన్‌లో 74,571.25 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167.95 పాయింట్లు పెరిగి.. 22,570.35 వద్ద స్థిరపడింది.

* ఈ వేసవిలో ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలని చాలా మంది ఎదురుచూస్తుంటారు. వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని అందిస్తోంది. శిర్డీతో పాటు త్రయంబకేశ్వర ఆలయ సందర్శనకు సదుపాయం కల్పిస్తోంది. టికెట్లు, బస ఏర్పాట్లతో ఈ ట్రిప్‌ను తీసుకొచ్చింది. తక్కువ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునే వారు దీనిని పరిశీలించొచ్చు. ‘శిర్డీ విత్‌ జ్యోతిర్లింగం’ పేరిట (SHIRDI WITH JYOTHIRLINGAM) ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమై త్రయంబకేశ్వరం, పంచవటి, శిర్డీ సందర్శన అనంతరం తిరిగి సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. ఈ ట్రిప్‌ మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లు కొనసాగుతుంది. మే 7, 14, 21, 28 తేదీల ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

* పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతా సర్వీస్‌ ఛార్జీలను సవరించాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, యెస్‌ బ్యాంక్‌ ఆ జాబితాలో ఉన్నాయి. మే 1 నుంచి కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. ఏయే సేవల ఛార్జీలు మారాయో బ్యాంకుల వారీగా చూద్దాం..

*** ఐసీఐసీఐ బ్యాంక్‌..

* చెక్‌బుక్‌లు, ఐఎంపీఎస్‌ లావాదేవీలు, ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ రిటర్నుల వంటి ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్‌ సవరించింది.
డెబిట్‌ కార్డు ఫీజు: ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99
చెక్‌ బుక్‌: తొలి 25 చెక్‌లు ఉచితం. తర్వాత ప్రతీ చెక్‌కు రూ.4
డీడీ/పీఓ ఫీజు: రద్దు, డ్యూప్లికేట్‌, రీవ్యాలిడేషన్‌కు రూ.100
సిగ్నేచర్‌ అటెస్టేషన్‌: ఒక్కో అప్లికేషన్‌కు రూ.100
ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ రిటర్నులు: ఒక్కోసారికి రూ.500
స్టాప్‌ పేమెంట్‌: ఒక్కో చెక్‌కు రూ.100 (ఐవీఆర్, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఉచితం)
ఖాతా మూసివేత, డెబిట్‌ కార్డు పిన్ రీజనరేషన్‌, డెబిట్‌ కార్డు డీ-హాట్‌లిస్టింగ్‌, బ్యాలెన్స్‌ సర్టిఫికెట్‌, ఇంట్రెస్ట్‌ సర్టిఫికెట్‌ వంటి సేవలకు ఎలాంటి రుసుము లేదు.

*** యెస్‌ బ్యాంక్‌..
యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్‌ నిబంధనలు
సేవింగ్స్‌ ప్రో మ్యాక్స్‌: రూ.50,000. లేదంటే గరిష్ఠంగా రూ.1,000 వరకు ఛార్జి.
సేవింగ్స్‌ ప్రో ప్లస్‌, యెస్‌ ఎసెన్స్‌, యెస్‌ రెస్పెక్ట్‌: రూ.25,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.
సేవింగ్స్‌ ప్రో: రూ.10,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.
సేవింగ్స్‌ వాల్యూ, కిసాన్‌ ఎస్‌ఏ: రూ.5,000. లేదంటే గరిష్ఠంగా రూ.500 ఛార్జి.
మై ఫస్ట్‌ యెస్‌: రూ.2,500. లేదంటే గరిష్ఠంగా రూ.250 ఛార్జి.
డెబిట్‌ కార్డు ఛార్జీలు..
ఎలిమెంట్: రూ.299
ఎంగేజ్‌: రూ.399
ఎక్స్‌ప్లోర్‌: 599
రూపే (కిసాన్‌ అకౌంట్): రూ.149
ఏటీఎం లావాదేవీ ఛార్జీలు..
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.21, ఆర్థికేతర లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z