Editorials

భారత్‌తో వ్యాపారానికి పాక్ ఆసక్తి

భారత్‌తో వ్యాపారానికి పాక్ ఆసక్తి

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan).. కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మొదలుపెట్టాలనే వాదన పాక్‌ వర్తకుల నుంచి మొదలైంది. ఇటీవల జరిగిన భేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన అక్కడి వ్యాపారవేత్తలు.. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz sharif)కు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా వ్యాపారవేత్తలతో మంతనాలు జరిపిన ఆయన బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధిని ఉదహరించారు. ఒకప్పుడు భారం అనుకున్న దేశాన్ని చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించే మార్గాలపై చర్చించేందుకు గాను పాకిస్థాన్‌ వ్యాపారవేత్తలతో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల భేటీ అయ్యారు. గంటపాటు చర్చించిన అనంతరం.. వారి నుంచి ప్రశ్నలు, సలహాలు చెప్పేందుకు అవకాశమిచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఆరీఫ్‌ హబీబ్‌ అధినేత మాట్లాడుతూ.. ‘దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వాధినేతగా చొరవ తీసుకోవాలి. ఈక్రమంలో భారత్‌తోనూ చర్చలు జరపాలి. అది ఆర్థికవ్యవస్థకు ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. అడియాలా జైల్లో ఉన్న (మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌) వ్యక్తితోనూ సంప్రదింపులు జరపాలి. సమస్యల పరిష్కారాలకు మరిన్ని అడుగులు వేయాలి’ అని ప్రధానికి సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z