Devotional

₹3.2కోట్ల విలువైన ₹2000 నోట్లను మార్చిన తితిదే

₹3.2కోట్ల విలువైన ₹2000 నోట్లను మార్చిన తితిదే

తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్‌ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. కొందరు భక్తులు ఆ తరువాత కూడా స్వామివారి హుండీలో వాటిని సమర్పించారు. దీంతో ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని తితిదే ఉన్నతాధికారులు ఆర్‌బీఐని పలుమార్లు కోరారు. సానుకూలంగా స్పందన రావడంతో గతేడాది అక్టోబరు 8 నుంచి ఈ ఏడాది మార్చి 22 వరకూ అయిదు విడతల్లో రూ.3.20 కోట్ల విలువైన నోట్లు మార్చినట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z