* దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్ కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (ంఅరుతి శుజుకి) కంపెనీ నుంచి ఈ కారు రాబోతోంది. ఇందుకోసం జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్ కార్ల తయారీపై పని చేస్తోంది. ఈవిషయాన్ని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఎక్కువ మైలేజీతో ఇవి రానున్నాయని తెలిపారు. మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.
* దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈవిషయం వెల్లడైంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (ట్ఛ్శ్), ఇన్ఫోసిస్ (ఈంఫొస్య్స్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హ్ఛ్ళ్టెచ్), విప్రో (విప్రొ), టెక్ మహీంద్రా (టెచ్ ంఅహింద్ర) ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఆయా సంస్థల లాభనష్టాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించాయి. ఈ గణాంకాలను గమనిస్తే.. మొత్తంగా 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. టీసీఎస్‌లో 13,249 మంది, విప్రోలో 24,516, ఇన్ఫీలో 25,994, టెక్ మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగుల తగ్గుదల నమోదైంది. ఒక్క హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగింది. అంటే టాప్-5 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఒక్క హెచ్‌సీఎల్‌లో మాత్రమే. ఈ పరిస్థితి ఉద్యోగార్థులను కలవరపెడుతోంది.
* ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. మెసేజ్‌లను పంపడం, డౌన్‌లోడ్, లాగిన్ యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్ వైబ్‌సైట్ తెలిపింది. ఇందులో 30శాతం యాప్ సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
* జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ… దేశీయ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు.. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. అలాగే గంటకు 230 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 205కిలోవాట్ల ఏసీ చార్జర్ కలిగిన ఈ కారు బ్యాటరీ కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జికానున్నది. 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 360 డిగ్రీల్లో కెమెరా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లతో రూపొందించింది.
* ప్రముఖ సెర్చింజన్ గూగుల్ (ఘూగ్లె) సీఈవో సుందర్ పిచాయ్ (శుందర్ ఫిచై) సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్‌తో తనకున్న బంధంపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి నేటి వరకూ గూగుల్‌లో తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్ల నుంచి నేటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగినట్లు చెప్పుకొచ్చారు. ‘2004 ఏప్రిల్ 26న గూగుల్‌లో నా తొలి రోజు ప్రారంభమైంది. ప్రాడక్ట్ మేనేజర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంస్థలో చాలా మార్పులు జరిగాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించే ప్రజల సంఖ్య.. ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నా జుట్టు కూడా. కానీ, ఈ గొప్ప సంస్థలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇందులో భాగమైనందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’ అని సుందర్ పిచాయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ నుంచి తనకు అందిన తీపి గుర్తులను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z