NRI-NRT

పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించండి-NRI BRS Bahrain

పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించండి-NRI BRS Bahrain

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని రాష్ట్ర ప్రజలకు ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ కార్య‌వ‌ర్గం విజ్ఞ‌ప్తి చేసింది. ఎన్నారై బీఆర్ఎస్.బహ్రెయిన్‌ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఈ మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. తెలంగాణాలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించవల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, బొలిశెట్టి ప్రమోద్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య, తిప్పారవేణి శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్, కొందరి రాజేరేందర్, పెనుగొండ శ్రీకాంత్, కోటగిరి శ్రీనివాస్, స్వామి, బిఆర్ఎస్‌ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z