* ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్‌లోడ్, లాగిన్ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.
* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్ (BSNL Cinemaplus) ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ కోసం గతంలో నెలకు రూ.99 వసూలు చేయగా.. దాన్ని తాజాగా రూ.49కు కుదించింది. దీంట్లో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. దీనితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.49తో వచ్చేది స్టార్టర్ ప్యాక్ మాత్రమే. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ కూడా ఉంది. దీని ధర నెలకు రూ.199. రూ.249తో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీమియం ప్లాన్‌ను కూడా ఇస్తోంది. దీంట్లో జీ5, సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఎంజాయ్ చేయొచ్చు. సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ ప్లే పేరిట ఎయిర్‌టెల్, జియోటీవీ ప్రీమియం పేరిట జియో, టాటా ప్లే బింజ్‌తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలను అందిస్తున్నాయి.
* సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. “2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు” అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్‌డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు.
* ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.
* ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్‌ఎస్‌డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు. మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్‌ఎస్‌డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z