ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో కరీబియన్‌లోని కురసావులో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయం(SMU) 2024 స్నాతకోత్సవం గత శనివారం డెట్రాయిట్‌లోని సెయింట్ తోమా చర్చిలో ఘనంగా నిర్వహించారు. అయిదేళ్ల వైద్య విద్యను మూడేళ్ల పాటు కురసావులోని SMU క్యాంపస్‌లో పూర్తి చేసి, మిగతా రెండేళ్ల రొటేషన్ తరగతులను అమెరికాలో అభ్యసిస్తున్న 21మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెఫ్రాలజిస్ట్ డా. కార్తీక్ రమణి హాజరయి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో SMU కులపతి డా. గింజుపల్లి మురళి, ఉప-కులపతి డా. దానా సొరియా, డీన్ డా. వింతా రవికిషోర్ రెడ్డి, యూనివర్శిటీ ప్రతినిధులు సజ్జా శ్రీనివాస్, నిరంజన్ శృంగవరపు, డా. పూరేటి శ్రీరామ్, డా. కిలారు మాలతి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z