* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
* వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని.. మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.
* దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది. కానీ, భారాస ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది’’ అన్నారు.
* దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
* వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
* విద్యుత్తు, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది. అద్దెపై ఇప్పటికే సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్లులకూ దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి.
* సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత రెండేళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు. కానీ, అనూహ్యంగా ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు రికార్డు రెండుసార్లు బద్ధలు కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్ – 4లో కొనసాగుతోంది. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో తమ జట్టు ఛేజింగ్‌కి వస్తే హైదరా‘బాధ’ తప్పదా అని ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.
* సందేశ్‌ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని ప్రశ్నించింది. సందేశ్‌ఖాలీ అంశంలో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
* ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి.
* దేశంలో ఓవైపు సార్వత్రిక ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. వీటన్నింటినీ లెక్క చేయకుండా అగ్ర నేతలు తమ పర్యటనలు, ప్రచార ర్యాలీలను కొనసాగిస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. మండే ఎండల్లోనూ సుడిగాలి పర్యటనలతో అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ మోదీ తన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇంత వేడి వాతావరణంలోను ప్రధాని మోదీ ప్రతిరోజు దాదాపు 3,500 కి.మీ. తిరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో రోజుకు 4 సభలు ఉండేలా చూసుకున్నారు.
* కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) (Prajwal Revanna) అసభ్యకర వీడియోల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఆయన తండ్రి, దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ స్పందించారు. అదంతా ఓ కుట్ర అని కొట్టిపారేశారు. తాము భయపడి పారిపోయే రకం కాదని ఆయన వెల్లడించారు. ‘‘ఎలాంటి కుట్ర జరుగుతోందో నాకు తెలుసు. భయపడి పారిపోయే రకాలం కాదు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనీయండి. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నాం. సిట్ లేదా సీఐడీకి అప్పగించనీయండి’’ అని రేవణ్ణ వ్యాఖ్యానించారు.
* దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని వ్యాఖ్యానించారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా దేవుడి దృష్టిలో తప్పేనని చెప్పారు.
* చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా.. స్పందించకపోవడంతో పులివర్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2+2 భద్రత ఇచ్చి ఆ తర్వాత తొలగించారని తెలిపారు. భద్రత కల్పించాలని కోరినా పోలీసుశాఖ ఉత్తర్వులు ఇవ్వలేదని వివరించారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. నేటి(సోమవారం) నుంచే పులివర్తి నానికి, ఆయన కుటుంబసభ్యులకు 1+1 భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.
* ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుదిజాబితాను రిటర్నింగ్ అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ్యాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
* ఎన్నికల పోలింగ్‌లో ప్రతిఒక్కరి వేలికీ సిరా చుక్క పెడతారు తెలుసు కదా. ఎన్నికల్లో ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. కొన్ని వారాల పాటు చెరిగిపోదు. అసలీ సిరా చుక్క వాడకం తొలిసారి ఎప్పుడు మొదలైంది? అది ఎందుకు చెరిగిపోదు? దీని ప్రత్యేకతలేంటి? తదితర వివరాలను పరిశీలిస్తే..ఈ సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) అనే కంపెనీ తయారుచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతిచ్చింది. నేషనల్ ఫిజికల్ లేబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ సిరాను సరఫరా చేస్తుంటారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. 2006 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందివరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకన్నా ముందువరకు గోరు పైభాగపు చర్మంపైనే వేసేవారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారమంతా దాదాపు లాభాల్లో కొనసాగిన సూచీలకు చివరి ట్రేడింగ్ సెషన్‌లో నష్టాలు ఎదురయ్యాయి. ఒక్కరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈక్రమంలో సెన్సెక్స్ 900కు పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 పాయింట్ల మార్కు ఎగువన ముగిసింది.
* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం. అమిత్‌షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z