తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 27న సత్తావిస్ పాటిదార్ సెంటర్, వెంబ్లీ, లండన్ లో 19వ ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకాడమి అవార్డు గ్రహీత గీత రచయిత డాక్టర్ చంద్రబోస్ హాజరయ్యారు. హెస్టన్ ఎంపీ సీమా మల్హోత్రా, HCI లండన్ నుండి నందితా సాహులు పాల్గొన్నారు.
డాక్టర్ చంద్రబోస్ తెలుగు భాష-సంస్కృతిని కీర్తిస్తూ ఆశువుగా పాటలు పాడారు. ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంపై తన అనుభవాలను పంచుకున్నారు. భార్య సుచిత్రతో కలిసి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. TAL ధర్మకర్తల మండలి మరియు శ్రీధర్ వనం, వంశీ మోహన్, సత్యేంద్ర పగడాల, రాములు దాసోజు, భారతి కందుకూరి తదితరులు సత్కరించారు. అనంతరం తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్లౌసెస్టర్ ప్రదర్శించిన ప్రహ్లాద నాటకం ఆహుతులను మైమరిపించింది. క్లాసికల్ మరియు ఫ్యూజన్ నృత్య ప్రదర్శనలు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గాయకులు దీపు, నూతన మోహన్ పాటలకు ప్రేక్షకులు డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి వింధ్య విశాఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. TAL కల్చర్ సెంటర్‌లకు చెందిన విద్యార్థులు టాలీవుడ్ మెడ్లీలు, శాస్త్రీయ గానాలు, నృత్యాలు ప్రదర్శించారు. ధర్మకర్తల మండలి కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీల, రవి మోచర్ల, IT ఇంచార్జి రాయ్ బొప్పన, చైర్మన్ రవి సబ్బ, TAL ఉగాది 2024 కన్వీనర్ బాలాజీ కల్లూర్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. టాళ్ వార్షిక పత్రికను డాక్టర్ చంద్రబోస్ ఆవిష్కరించారు. ముఖ్య సంపాదకులు రమేష్ కలవలను సత్కరించారు. మ్యాగజైన్ నిర్మాణానికి సూర్య కందుకూరి సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z