Movies

రజనీ “కూలీ”కి ఇళయరాజా నోటీసులు

రజనీ “కూలీ”కి ఇళయరాజా నోటీసులు

రజనీకాంత్‌ సినిమా ‘కూలి’ మేకర్స్‌కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన ‘తంగమగన్’ సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. ‘వా వా పక్కం వా’ అనే సాంగ్‌ ‘కూలి’ టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్‌ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్‌లో సాంగ్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్‌ పిక్చర్స్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్‌ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z