DailyDose

సూరిని చంపిన భానుకిరణ్‌కు హైకోర్టులో చుక్కెదురు-CrimeNews-May 02 2024

సూరిని చంపిన భానుకిరణ్‌కు హైకోర్టులో చుక్కెదురు-CrimeNews-May 02 2024

* ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్‌ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌లోని వడాలిలో ఈ సంఘటన జరిగింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు పార్సిల్‌ ద్వారా ఒక ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే బుధవారం ఆ పార్సిల్‌ పేలింది. జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ఈ సంఘటనలో మరణించారు. 9, 10 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పార్సిల్‌ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడటంపై స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పార్శిల్‌ను ఎవరు డెలివరీ చేశారు? అది ఎందుకు పేలింది? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్‌ చేస్తూ.. భానుకిరణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు ఆదేశాలను సమర్థించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సూరి హత్య కేసులో భానుకిరణ్‌ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 4న హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో సూరిని కాల్చి చంపగా.. 2018 డిసెంబర్‌లో అతడికి నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మద్దెలచెర్వు సూరి 2009 డిసెంబర్‌ 29న బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసు ఆంక్షల దృష్ట్యా బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండేవారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆయనకు ప్రధాన అనుచరుడే భానుకిరణ్‌. జనవరి 4, 2011న సూరి.. భానుకిరణ్‌తో కలిసి సనత్‌గర్‌ వెళ్తుండగా. వెనకసీట్లో ఉన్న భాను.. సూరిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో షాక్‌ తిన్న డ్రైవర్‌ మధు వాహనాన్ని ఆపేశాడు. అదే అదునుగా భాను అక్కడి నుంచి పరాయ్యాడు. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్‌లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

* సన్యాసి అయిన దత్త పుత్రుడితో రాజకీయ నాయకురాలి సంబంధాన్ని ఆమె భర్త బట్టబయలు చేశాడు. (Thai female politician) వారిద్దరూ బెడ్‌పై ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతడు రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రాజకీయంగా సంచలనం రేపింది. థాయ్‌లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. సెంట్రల్ థాయిలాండ్‌లోని సుఖోథాయ్ ప్రావిన్స్‌కు చెందిన 45 ఏళ్ల ప్రపపోర్న్ చోయివాడ్కో ప్రముఖ రాజకీయ నాయకురాలు. డెమోక్రాట్ పార్టీ సభ్యురాలైన ఆమె ప్రస్తుతం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు.

* తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తినిఓ మహిళ దారుణంగా హతమార్చింది(Woman killed) . ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri district) జిల్లా ఇల్లందు మండలం వజ్జవారిగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీను(48), సరిత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని మద్యం మత్తులో ఉన్న శ్రీను సరిత ఉరేసి(Hanging) చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z