Devotional

శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం

శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈవో పెద్దిరాజు ఆదేశాల మేరకు పారిశుద్ధ్యపు సిబ్బందితో కలిసి పర్యవేక్షకులు అయ్యన్న దేవస్థానం చెక్‌పోస్టు వద్ద ప్లాస్టిక్‌ బాటిళ్లను, చెత్త చెదారాన్ని తీసివేసి శుభ్రపరిచారు. అలాగే వివిధ వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్‌ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా తనిఖీలు నిర్వహించారు. కాగా, ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలని స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులను ఆలయ అధికారులు సూచించారు. ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా మట్టి, స్టీల్‌, రాగి సీసాలను వినియోగించుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాల్సిందిగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులను కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z