Devotional

Telugu Horoscope – May 03 2024

Telugu Horoscope – May 03 2024

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి ఆశించిన లాభాలు అందుకుం టారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యో గులు ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది కానీ, అందుకు పోటీగా అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశ ముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదరులతో ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు చురుకుగా, ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. పిల్లలకు చదువుల్లో లేదా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపా రాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆస్తి కొనుగోలు వ్యవహారం సంతృప్తికరంగా ముగుస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా, మరింత లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గు తుంది. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులుంటాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సాయపడే స్థితిలో ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కష్టార్జితానికి మించిన ఖర్చులుంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్య మైన పనుల్లో ఒడిదుడుకులుంటాయి. స్థిరత్వం లేని ఆలోచనలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకా శముంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన వివాదాలు, సమస్యలు తేలికగా పరి ష్కారం అవుతాయి. ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా పూర్తవుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా బాగా సహాయపడతారు.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పెండింగు పనులు, ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో అపా ర్థాలు తలెత్తుతాయి. ఇల్లు కొనుగోలు వ్యవహారం పూర్తవుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కాస్తంత శ్రమాధిక్యత ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శుభ కార్యాలు, పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాలు అందు కుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z