* వరుస లాభాలతో రాణిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు గట్టి షాక్ తగిలింది. వారాంతంలో ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ రూపంలో ‘హెవీ’ స్ట్రోక్ తగిలింది. రిలయన్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో ఓ దశలో 1100కు పైగా పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకుని మూడెంకల నష్టాల నుంచి బయటపడింది. నిఫ్టీ 22,450 స్థాయికి చేరింది. ఉదయం సెన్సెక్స్ 75,017.82 (క్రితం ముగింపు 74,611.11) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపటి వరకు లాభాల్లోనే కొనసాగింది. తర్వాత నష్టాల పరంపర మొదలైంది. అలా రోజంతా పడుతూనే ఉంది. ఇంట్రాడేలో 73,467.73 వద్ద కనిష్ఠాన్ని సూచీ టచ్ చేసింది. అంటే గరిష్ఠాల నుంచి దాదాపు 1600 పాయింట్లు కోల్పోయింది. చివరికి 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 191.55 పాయింట్ల నష్టంతో 22,456.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది.
* మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ (ఝెత్ ఆఇర్వయ్స్) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (ణరెష్ ఘొయల్) బెయిల్ కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్య క్యాన్సర్ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉందని, తనకు ఇక బతికుండాలన్న ఆశ కూడా లేదన్నారు. జీవిత చరమాంకంలో తన భార్య పక్కన ఉండేందుకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా గోయల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే బృందం.. ఆయన వేదనను కోర్టుకు విన్నవించింది. ‘‘నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనిత ఇద్దరూ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయన భార్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇంకొన్ని నెలలే బతుకుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. శరీరం కంటే మనసు చాలా బలహీనమైంది. అందునా ఆయన కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. భార్య చనిపోతుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతనికీ బతకాలన్న ఆశ చచ్చిపోయింది. అనితకు వైద్యచికిత్స అందుతోంది. కానీ ఈ సమయంలో ఆమెకు సొంతవారి ప్రేమ ఎంతో అవసరం. ఆమెను దేవుడు ఇంకెన్నాళ్లు ఉంచుతాడో తెలియదు. కానీ ఆ కొద్ది నెలలైనా తన భార్యతో ఉండేలా ఆయనకు స్వేచ్ఛ కల్పించండి’’ అని గోయల్ న్యాయబృందం కోర్టును అభ్యర్థించింది.
* వివిధ రకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే జెనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్‌లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ శుక్రవారం తెలిపింది. అమెరికా మార్కెట్‌లో డాక్సీసైక్లిన్ క్యాప్సూల్స్ (40 ంఘ్)ను విడుదల చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రొడక్ట్ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఊశ్Fడా) ఆమోదించిన ఒరేసియా క్యాప్యూల్స్ (40 ంఘ్)కు సమానమైనది.
* ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (టెస్ల) కంపెనీ ట్రేడ్ మార్క్ వ్యవహారంలో భారత్‌కు చెందిన ఓ కంపెనీపై కోర్టును ఆశ్రయించింది. టెస్లా పవర్ ఇండియా (టెస్ల పౌఎర్ ఈందీ) అనే కంపెనీ తన ట్రేడ్ మార్క్‌ను వినియోగిస్తూ ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో టెస్లా పవర్ కంపెనీకి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేసింది.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (భజజ్ ఔతొ) మరో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ (ఫుల్సర్ ణ్శ్400Z) పేరిట దీన్ని శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధరను రూ.1.85 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రస్తుత ధర ఒక నెల మాత్రమే ఉంటుందని బజాజ్ తెలిపింది. ఆ తర్వాత ధరను సవరించనున్నారు. గ్లోసీ రేసింగ్ రెడ్, ప్యూటర్ గ్రే, మెటాలిక్ పెరల్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. కొత్త బజాజ్ పల్సర్ మోస్ట్ అడ్వాన్స్‌డ్ మోడల్ అని కంపెనీ పేర్కొంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 373చ్చ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8,800 ర్ప్మ్ వద్ద 40భ్ప్ పవర్‌ను, 6,500ర్ప్మ్ వద్ద 35ణ్మ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 154క్ఫ్ టాప్ స్పీడ్‌ను బైక్ అందుకుంటుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. ముందువైపు 320మ్మ్ డిస్క్ బ్రేక్, వెనక వైపు 230మ్మ్ రియర్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. స్పోర్ట్స్ రోడ్, రైన్, ఆఫ్- రోడ్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ కొత్త పల్సర్ డ్యూయల్ ఛానెల్ ఆభ్శ్ డిస్క్ బ్రేక్‌లతో వస్తోంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
* దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది. 2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది. మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z