Movies

టాలీవుడ్‌లో…16 ఏళ్లకే #MeToo అనుభవం. ధైర్యంగా తిప్పికొట్టింది.

టాలీవుడ్‌లో…16 ఏళ్లకే #MeToo అనుభవం. ధైర్యంగా తిప్పికొట్టింది.

నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్‌ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్‌ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్‌ నుంచి కమిట్‌మెంట్‌ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్‌మెంట్‌ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్‌, రెమ్యునరేషన్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్‌ ఇవ్వండి అని కోరాను. కానీ, ఇలాంటి కమిట్‌మెంట్‌ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్‌ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు.’ అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్‌ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్‌ చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z