DailyDose

తాడేపల్లిలో ₹5లక్షల డ్రగ్స్ పట్టివేత-CrimeNews-May 04 2024

తాడేపల్లిలో ₹5లక్షల డ్రగ్స్ పట్టివేత-CrimeNews-May 04 2024

* ఒక యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ మహిళను చూసి ఆమె వయస్సు 45 ఏళ్లుగా తెలుసుకున్న ఆ యువకుడు షాక్‌ అయ్యాడు. ఆగ్రహంతో ఆమెను కొట్టాడు. (Youth beats woman) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల దీపేంద్ర సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మహిళ పరిచయమైంది. ప్రొఫైల్‌ ఫొటో యంగ్‌గా ఉండటంతో ఆమెతో చాట్‌ చేశాడు. ఆన్‌లైన్‌ స్నేహం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో ఒకసారి కలుసుకోవాలని భావించారు. కాగా, దీపేంద్ర సింగ్‌, ఆ మహిళ స్వయంగా కలుసుకున్నారు. అయితే వయసులో పెద్దగా ఆమె ఉండటం చూసి అతడు షాక్‌ అయ్యాడు. దీని గురించి ఆ మహిళను ఆరా తీయగా తన వయస్సు 45 ఏళ్లు అని చెప్పింది. దీంతో ఆగ్రహించిన దీపేంద్ర సింగ్‌ ఆ మహిళను కొట్టాడు. ఆమె తలను నేలకేసి బాదాడు. ఆ మహిళ మొబైల్‌ ఫోన్‌ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తి తనను కొట్టి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయగా ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుడు దీపేంద్ర సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

* మల విసర్జన కోసం బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పుపెట్టారు. (Dalit girl set on fire) దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మల విసర్జన కోసం సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. అయితే గంట వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక కోసం వెతకగా పొలాల్లో ఆమెకు నిప్పు పెట్టడంతో సజీవ దహనం కావడాన్ని చూసినట్లు గ్రామస్తులు తెలిపారు.

* ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది (Accident). ముస్సోరి – డెహ్రాడూన్‌ మార్గ్‌ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్‌లోని పానీ వాలా బండ్‌ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు డెహ్రాడూన్‌ ఐఎంఎస్‌ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు

* కర్ణాటక (Karnataka)లోని హవేరీ (Haveri) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమారుడు చేసిన తప్పుకు ఓ తల్లి బలైంది. రాణేబెన్నూర్ తాలూకా అరెమల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన అదే గ్రామానికి చెందిన యువతితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయింది. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లి 50 ఏళ్ల హనుమవ్వపై దాడి చేసింది. అనంతరం ఆమెను ఇంట్లో నుంచి వీధిలోకి లాక్కొచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి (woman tied to pole) దారుణంగా కొట్టారు (thrashed).

* గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా.. ఎస్‌ఈబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z