నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని పేర్కొంది. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన అంశాలివీ..
91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారిలోనే సంభవించాయి.
70% ప్రారంభ దశ, 86% ముదిరిన దశ క్యాన్సర్లు మధ్యతరగతి కుటుంబాల వారిలోనే బయటపడ్డాయి.
అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే రూ.57,22,803, స్త్రీలైతే రూ.71,83,917లుగా గణించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z