NRI-NRT

సింగపూర్‌లో రామ్‌మాధవ్ పుస్తక పరిచయం

సింగపూర్‌లో రామ్‌మాధవ్ పుస్తక పరిచయం

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్‌లోని(Singapore) ప్రవాస భారతీయులతో బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా.రామ్ మాధవ్(Dr Ram Madhav) రచించిన నూతన గ్రంథ పరిచయ కార్యక్రమం( భూక్ లౌంచ్) ఘనంగా నిర్వహించారు. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ (The Indian Reality: Changing Narratives, Shifting Perceptions) పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో నిర్వహించారు. పుస్తక రచయిత డా.రామ్ మాధవ్ తన అనుభవాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి,శ్రీ సాంస్కృతిక కళాసారథి,సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, ప్రభురామ్, మమత, దినేష్ పాల్గొన్నారు. కాగా, కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియాన్ని సమకూర్చిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z