NRI-NRT

వాషింగ్టన్ డీసీలో ఎన్నారై తెదేపా మహిళల సమావేశం

వాషింగ్టన్ డీసీలో ఎన్నారై తెదేపా మహిళల సమావేశం

వైసీపీ అరాచకాలపై మేము సైతం అంటూ ఎన్ఆర్ఐ (ణృఈ) మహిళలు సమరశంఖం పూరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఎన్ఆర్ఐ మహిళల ఆధ్వర్వంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. స్వస్థలాలకు వెళ్లగలిగిన వారు వెళ్లి ఏదో ఒక రూపంలో సహాయపడటం, లేదా కనీసం ఇక్కడి నుంచైనా టీడీపీ (ట్డ్ఫ్) విజయానికి సహకారం అందించాలన్నారు. మంజుష గోరంట్ల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు (ఛంద్రబబు) ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనిత మన్నవ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మనవంతు కర్తవ్యం నిర్వహించాలని అన్నారు.

సింధూ పూసల మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉంటున్న మాకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల చాలా ఆందోళనగా ఉంది. అందుకు మేము సైతం మా వంతుగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం’ అని అన్నారు. శాంతి పారుపల్లి మాట్లాడుతూ యువత భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. నీలిమా మండవ మాట్లాడుతూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి రావడంతో పాటు స్నేహితులు, బంధువులను కూడా చైతన్యపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సరిత పోసాని, రజని పాలడుగు, ప్రణీత కంతు, విద్య కుక్కపల్లి, కృష్ణవేణి కూరపాటి, శ్రీవిద్య సోమ, పద్మ యడ్లపల్లి, కార్జెల్ చలసాని, ప్రసన్న కొల్ల, సౌజన్య కొడాలి, శ్రీదేవి, లక్ష్మి గుంటు, సుధ ధూళిపాళ్ల, రాజీ మదమంచి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z