మేషం
అనుకూల ఫలాలు ఉంటాయి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
వృషభం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
మిథునం
బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం చదివితే బాగుంటుంది.
కర్కాటకం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగి సత్ఫలాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
సింహం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
కన్య
మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
తుల
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. చిత్తసౌఖ్యం ఉంది. మనోధైర్యం సదా కాపాడుతుంది. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
వృశ్చికం
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు.
మకరం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవం స్తుతి శుభప్రదం.
కుంభం
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.
మీనం
ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బంది కలిగిస్తుంది. చెడు సావాసాల వల్ల సమస్యలు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z