మేషం
మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
వృషభం
మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన మంచిది.
మిథునం
ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కర్కాటకం
చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
సింహం
దైవబలం అనుకూలిస్తోంది.నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది.
కన్య
మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
తుల
మీ మీ రంగాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులపాలవుతారు. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.
ధనుస్సు
శుభకాలం. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.
మకరం
బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనా ధోరణి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
కుంభం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
మీనం
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z