ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో డల్లాస్‌లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించారు. రోబో గణేశన్ ఈ కార్యక్రమంలో శిక్షణనిచ్చారు. 20మంది పిల్లలు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. రోబో గణేశ్‌ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అభినందించారు. డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారే, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని సహకరించారు. డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z