మేషం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
వృషభం
ఏ నిర్ణయం తీసుకున్నా బంధు,మిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.
మిథునం
గ్రహబలం అనుకూలిస్తోంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం.మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.
కర్కాటకం
ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువుని ఆరాధించాలి.
సింహం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వలన కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.
కన్య
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
తుల
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.
మకరం
అనుకున్నది సాధిస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.
కుంభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్యనమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
మీనం
శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z