NRI-NRT

నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌పై వెబినార్

నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌పై వెబినార్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో అంతర్జాలంలో లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌పై వెబినార్ నిర్వహించారు. జీవితాన్ని అందంగా ఎలా మలుచుకోవాలి? మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి? అనే అంశాలపై ఈ వెబినార్‌లో చర్చించారు. ప్రముఖ వైద్యురాలు మీనా చింతపల్లి ఈ వెబినార్‌లో మైండ్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన అంశాలు వివరించారు. వెంకట్ మంత్రి సమన్వయపరిచారు. నాట్స్ మాజీ ఛైర్ పర్సన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. మీనా చింతపల్లికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z