* హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిధిలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు కావడం కలకలం రేపింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని కాలిన గాయాలయ్యాయి. హాస్టల్లోని నాలుగో అంతస్తులోని స్నానాల గదిలో ఆమెకు గాయాలు కావడంతో.. స్నేహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, యువతి స్నానం చేసే నీటి బకెట్లో ఎవరో యాసిడ్ కలిపారన్న వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, వేడి నీరు ఒంటిపై పడటం వల్లే గాయాలైనట్లు పోలీసులు ప్రాథమికంగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోకిలా పోలీసులు తెలిపారు.
* వయసులో పెద్దదైన మహిళతో ఒక వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు మరి కొందరితో సంబంధాలు ఉన్నాయని అనుమానించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరుగడంతో ఆ మహిళను హత్య చేశాడు. (ంఅన్ ఖిల్ల్స్ ళివె ఈన్ ఫర్త్నెర్) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల వినీత భర్త మరణించాడు. దీంతో మూడేళ్ల నుంచి 35 ఏళ్ల గౌతమ్, ఆమె కలిసి సహజీవనం చేస్తున్నారు. నోయిడా సెక్టార్ 42లోని ఇంట్లో కలిసి ఉంటున్నారు. కాగా, మరి కొందరు మగవారితో వినీతకు సంబంధాలు ఉన్నట్లు గౌతమ్ అనుమానించాడు. మంగళవారం రాత్రి ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం, గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహించిన గౌతమ్, వినీతను తీవ్రంగా కొట్టాడు. ఆమె అచేతనంగా పడిపోవడంతో ఆ ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికులు వినీతను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వినీత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గౌతమ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* తల్లిదండ్రులు తమ కూతుర్ని కారులో వదిలేసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అతిథులతో మాట్లాడటంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత రెండో కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు కారులో చూడగా ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది. (ఫరెంత్స్ Fఒర్గెత్ ఛిల్ద్ ఈన్ ఛర్) రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ప్రదీప్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పెళ్లి వేడుకకు కారులో వెళ్లాడు. అక్కడకు చేరుకున్న తర్వాత భార్య, పెద్ద కూతురు కారు నుంచి దిగారు. కాగా, ఇద్దరు కుమార్తెలు కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్ కారును ఒక చోట పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు. తర్వాత అతడు కూడా లోపలకు వెళ్లాడు. వారిద్దరూ విడివిడిగా సుమారు రెండు గంటలపాటు పెళ్లికి హాజరైన వారిని కలిసి ముచ్చటించారు. మరోవైపు చివరకు కలుసుకున్న భార్యాభర్తలు మూడేళ్ల చిన్న కుమార్తె గోర్విక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆ చిన్నారి గురించి అక్కడ వెతికారు. మూడు గంటల తర్వాత పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లారు. డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో అచేతనంగా పడి ఉన్న గోర్వికను చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
* నంద్యాల జిల్లా శ్రీశైలం(శ్రిసైలం) ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్(ఛొన్స్తబ్లె) ఒకరు ఆత్మహత్య(శుఇచిదె) కు పాల్పడడం కలకలం కలిగిస్తోంది. కానిస్టే్బుల్ శంకర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ విశ్రాంతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ ప్రసాద్‌రావు విచారణ ప్రారంభించారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z