Devotional

Telugu Horoscope – May 17 2024

Telugu Horoscope – May 17 2024

మేషం
ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

వృషభం
మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం
ప్రారంభించిన కార్యక్రమాలను తోటి వారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. శ్రీగణపతి ఆరాధన మంచిది.

కర్కాటకం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.

సింహం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. శ్రీవిష్ణు సందర్శనం శుభప్రదం.

కన్య
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

తుల
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం
శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి.శ్రీఆంజనేయ దర్శనం మంచిది.

ధనుస్సు
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. మనఃసౌఖ్యం ఉంది. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.

మకరం
ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి.అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

కుంభం
మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభకరం.

మీనం
ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z