బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అంతరంగం నుండి ఉద్భివించిన 1100కు పైగా అద్భుతమైన శివపద గీతాలపై ఋషిపీఠం ఆధ్వర్యంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో నాల్గవ శివపద అంతర్జాతీయ పాటల పోటీ 16,17,18 తేదీల్లో యూట్యూబ్ వేదికగా నిర్వహించారు.
ఈ శివపదార్చన పోటీల్లో 7-70 సంవత్సరాల వయస్సు గల 250 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వయసుల వారీగా “ఉపమన్యు”, “మార్కండేయ”, “భక్త కన్నప్ప”, “నత్కీర”,”పుష్పదంత” అనే 5 విభాగాలుగా విభజించారు. 13 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్, కౌశిక్ కల్యాణ్, పెద్దాడ సూర్యకుమారి, లక్ష్మిమూర్తి విష్ణుప్రియ భరధ్వాజ్, శ్రీకాంత్ మల్లాజ్యోస్యుల, లక్ష్మిశేష భట్టుకు, సరస్వతి కాశి, అనీల కుమార్ గరిమెళ్ళ, లలిత రాంపల్లి, శేషుకుమారి యడవల్లి, అరవల్లి శ్రీదేవి, విద్యభారతి తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
జీవిత ప్రయాణమే శివమయమని ఈ శివపద జ్ఞానయజ్ఞం ప్రపంచవ్యాప్తంగా విస్తరించటం తద్వారా పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియడం ముదావహమని షణ్ముఖ శర్మ అన్నారు. ఓలేటి వెంకట పవన్, శ్రీనివాస్ మేడూరి, మేఘన వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, నాగసంపత్ వారణాసి, విజయ వడ్లమాని, రవి గుండ్లాపల్లి తదితరులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z