కొత్త వాయిస్ సామర్థ్యాలతో ఓపెన్ ఏఐ ఇటీవల ChatGPT 4oని ప్రవేశపెట్టింది. వాటిని బాగా ప్రచారం చేసింది. ఇందులో ఐదు విభిన్న స్వరాలను పరిచయం చేసింది. వాటిలో ‘‘స్కై(Sky)’’ కూడా ఒకటి. జాన్సన్ స్నేహితులు, కుటుంబసభ్యలు ChatGPT 4o స్కై (వాయిస్ అసిస్టెంట్)ను ఉపయోగిస్తున్న సమయంలో ఓ పోలికను గమనించారు. స్కై వాయిస్ అచ్చం జాన్సస్ మాటలానే అనిపించిందట. ఈ విషయాన్ని ఆమెకు తెలిపారు. ‘‘స్కై వాయిస్‌ని విని నేను షాకయ్యా! నా స్నేహితులు అందులో ఎటువంటి తేడాను గుర్తించలేకపోయారు’’ అని చెప్పింది.
చాట్‌జీపీటీ 4o చాట్‌బాట్ కోసం తన వాయిస్‌ని ఉపయోగించారని హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ ఆరోపించింది. చాట్‌బాట్ కోసం తన వాయిస్‌ని ఇవ్వాలని కంపెనీ ఈసీఓ శామ్ ఆల్ట్‌మన్ జాన్సన్‌ను సెప్టెంబరులోనే సంప్రదించారని.. కానీ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు పేర్కొంది. దీంతో న్యాయపరమైన చర్యలకు దిగింది. దీంతో వాయిస్ క్రియేషన్‌పై వివరణ ఇస్తూ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ఆల్ట్‌మన్ రెండు లేఖలు పంపారు. స్కై వాయిస్ జాన్సన్‌ది కాదని ప్రొఫెషనల్ యాక్టర్ నుంచి ఆ స్వరాన్ని రికార్డింగ్ చేసినట్లు తెలిపారు. అయితే గోప్యతా కారణాల వల్ల ఆ నటి వివరాలు వెల్లడించలేమన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z