Politics

ఏపీ ఫలితాలపై అమిత్‌షా జోస్యం

ఏపీ ఫలితాలపై అమిత్‌షా జోస్యం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది ఎన్డీయే సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామనీ విశ్వాసం వెలిబుచ్చారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కుపైగా సీట్లు సాధిస్తామన్నారు. ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌లలోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో తాజాగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈసారి అధికారంలోకి వచ్చాక.. ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z